సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి - వీరిద్దరూ జగన్ సొంతజిల్లా అధికారులే : టీడీపీ - tdp leaders complaint on cs dgp - TDP LEADERS COMPLAINT ON CS DGP
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 22, 2024, 8:33 PM IST
TDP Leaders Complaint on CS, DGP to Election Commission : సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎన్నికల సంఘానికి తెలుగుదేశం రాష్ట్రకార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. వీరుద్దరూ సీఎం జగన్ సొంతజిల్లా వారేనని అన్నారు. పరిపాలన, శాంతిభద్రతలు అదుపుతప్పడంలో వీరు కీలక పాత్ర పోషించారంటూ సీఈవో(CEO), సీఈసీ(CEC)కి లేఖ రాశారు. ఈ ఇద్దరు అధికారులూ జగన్‌తో అంటకాగుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో సీఎస్, డీజీపీలు ఎలా విధులు నిర్వర్తించాలో ప్రజలందరికి తెలుసన్నారు. రాష్ట్రంలో ఓ వైపు పోలీసులు, మరోవైపు రెవెన్యూ అధికారులు రాజ్యమేలుతున్నారని విమర్శించారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎంతోమంది దళితులపై పోలీసులు దాడులు చేశారని తెలిపారు. ఇలాంటి అధికారులను ఎన్నికల సమయంలో కొనసాగిస్తే మరిన్ని దారుణాలు జరిగే అవకాశం ఉందన్నారు. అంతేగాక సీఎస్, డీజీపీలను ముఖ్యమంత్రి పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకున్నారని విమర్శించారు. కావున రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే తక్షణం వీరిద్దరిని బదిలీ చేసి వీరీ స్థానంలో ఇతర రాష్ట్రానికి చెందిన అధికారులను నియమించాలని గోవర్ధన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.