టీడీపీ నేత మల్లెలపై అక్రమ రౌడీషీట్ ​- టీడీపీ శ్రేణుల ఆందోళన - మల్లెల రాజశేఖర్ పై అక్రమ రౌడీషీట్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 4:25 PM IST

TDP Leaders Agitation At National Highway in Nandyala District : నంద్యాల జిల్లా ఓర్వకల్లు జాతీయ రహదారిపై తెలుగుదేశం పార్టీ నాయకులు (TDP Leaders), కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం నేత మల్లెల రాజశేఖర్ గౌడ్ పై అక్రమంగా పెట్టిన రౌడీషీట్​ను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో  చేసిన నాయకులు అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. 

 Rowdy Sheet ON TDP Leader Malle : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే (MLA) కటసాని రాంభూపాల్ రెడ్డికి, పోలీస్ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు Slogans)  చేశారు. రాజకీయ కక్షలతో టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయిస్తూ రౌడీషీట్ ఓపెన్ చేయడంపై నిరసనకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రౌడీషీట్​ను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ (YSRCP) నాయకులు కావాలని రాజకీయ కక్షలతో చేసే పనులు ఆపాలని కోరారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.