జాతీయ రహదారి విస్తరణ పనుల్లో ఎమ్మెల్యే కోన అవినీతికి పాల్పడ్డారు: నరేంద్ర వర్మ - AP Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 12:35 PM IST

Vegesna Narendra Verma Fire on MLA Kona Raghupati: బాపట్లలో చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనుల్లో ఎమ్మెల్యే కోన రఘుపతి(MLA Kona Raghupati)అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేత నరేంద్ర వర్మ(TDP Leader Vegesna Narendra Verma) ఆరోపించారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పట్టణంలోని శ్రీనివాసనగర్‌ కాలనీవాసులను ఎమ్మెల్యే(MLA) ఇబ్బందులకు గురి చేశారన్నారు. పాత డివైడర్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక తవ్వకాల ద్వారా ఎమ్మెల్యే కోన రఘుపతి కోట్ల రూపాయల ప్రజా ధనం దోపిడీ చేశారని ఆరోపించారు.

"బాపట్లలో చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనుల్లో ఎమ్మెల్యే కోన రఘుపతి అవినీతికి పాల్పడ్డారు. రహదారి విస్తరణ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎమ్మెల్యే కోన అక్రమాలు తారస్థాయికి చేరాయి. డివైడర్లు కూల్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు." - వేగేశ్న నరేంద్ర వర్మ, టీడీపీ నేత 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.