బొత్స సత్యనారాయణపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య - Complaint against Botsa - COMPLAINT AGAINST BOTSA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-06-2024/640-480-21681540-thumbnail-16x9-complaint.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 10, 2024, 9:11 PM IST
Complaint on Botsa Satyanarayana: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పైనా అవినీతి నిరోధక శాఖకు తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. టీచర్ల బదిలీల విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స భారీగా అవినీతికి పాల్పడ్డారని ఏసీబీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. విజయవాడ లోని ఎసీబీ ప్రధాన కార్యాలయంలో ఎస్పీని కలిసిన ఆయన ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఒక్కో టీచర్ వద్ద 3 నుండి 6 లక్షల రూపాయలను బొత్స వసూలు చేశారని ఫిర్యాదులో తెలిపారు. బొత్సా హయాం లో విద్యాశాఖలో భారీ దోపిడీ జరిగిందని ఫిర్యాదులో వర్ల రామయ్య తెలిపారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా ఎవరైనా బదిలీలు చేశారని, టీచర్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. బొత్సా ఇంటి పై దాడి చేసేందుకు టీచర్స్ అంతా సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. మంత్రి బొత్స చేసిన అవినీతి అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య ఎస్పీని కోరారు.