రైతులను నమ్మించి కాకాని గోవర్ధన రెడ్డి నట్టేట ముంచాడు: ఎమ్మెల్యే సోమిరెడ్డి - FRAUD IN IRRIGATION DEPARTMENT - FRAUD IN IRRIGATION DEPARTMENT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 31, 2024, 9:30 PM IST
Huge Scandal at Irrigation Department in Nellore District : వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా నీటిపారుదల శాఖలో భారీ కుంభకోణాలు జరిగాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కేవలం ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే రూ.200 కోట్ల దోపిడీ జరిగిందని వెల్లడించారు. నియోజకవర్గంలోని అక్కంపేట, వీరంపల్లి, మడమనూరు గ్రామాలలో జరిగిన కాలువ పనులను స్థానిక రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. కాలువ పనులు చేయకుండానే 2024 ఆర్థిక సంవత్సరంలో 18 కోట్ల రూపాయలను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బినామీలు దోచుకుతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందులో జిల్లా నీటిపారుదల శాఖ అధికారి కృష్ణమోహన్ ప్రమేయం ఉందన్నారు. నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా నీటిపారులదల శాఖకు సంబంధించి ఎటువంటి పనులు చేపట్టాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నమ్మించి నట్టేట ముంచిన వ్యక్తి కాకాని గోవర్ధన రెడ్డి అని విమర్శించారు. వైసీపీ హయాంలో నీటిపారుదల శాఖలో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ వేసి దోషులను చట్టపరంగా శిక్షించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.