కాకాణి నకిలీ మద్యంతో ప్రజలను చంపేందుకు చూస్తున్నారు : టీటీపీ నేత సోమిరెడ్డి - Somireddy Comment - SOMIREDDY COMMENT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 25, 2024, 7:34 PM IST
TDP Leader Somireddy Comment on YSRCP Minister Kakani Govarthan Reddy : వైసీపీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని టీటీపీ నేత సోమిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో నకిలీ మద్యం దొరికిన సంఘటనలో వైసీపీ సుధాకర్, అతని డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రానున్న ఎన్నికల్లో కాకాణి గోవర్థన్ రెడ్డి ఎలాగైనా గెలవాలనే ఉద్ధేశ్యంలో అక్రమ మద్యంకు తెరలేపారని ఆరోపించారు. ఇప్పటికి వరకు రెండు చోట్ల భారీ మద్యం డంప్‌లు దొరికాయని ఆయన గుర్తు చేశారు.
ఇటీవల పంటపాళెంలో 4232, బుధవారం విరుపూరులో లభ్యమైన 2649 మద్యం సీసాలు కాకాణి గోవర్థన్ రెడ్డి సన్నిహితులైన సుధాకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి దగ్గరే దొరికాయని సోమిరెడ్డి తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజలకు పంచిపెట్టడానికి కల్తీ మద్యం మంత్రి కాకాణే తెప్పించారని సోమిరెడ్డి ఆరోపించారు. గత ఎన్నికల్లో కాకాణి అనుచరుల ఇళ్లల్లో కూడా కల్తీ మద్యం దొరికిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అధికారులు నిష్పాక్షపాతంగా విచారణ చేసి అసలు దోషి అయినా కాకాణిని ముద్దాయిగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.