ఎమ్మెల్యే చెవిరెడ్డి అన్యాయంగా పేదల ఇళ్లు కూల్చారు: పులివర్తి సుధారెడ్డి - houses Demolition in Tummalgunta

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 9, 2024, 8:14 PM IST

TDP Leader Pulivarthi Nani wife Sudhareddy on Chevireddy: తిరుపతి రూరల్ మండలంలోని తుమ్మలగుంటలో ఉన్న మఠం భూముల్లోని పేదల ఇళ్లను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్యాయంగా కూల్చివేశారని తెలుగుదేశం నేత పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ఆరోపించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్లను తొలగించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పంచాయతీ నుంచి అనుమతి పత్రం, కరెంటు మీటరు, ఇంటి పన్ను తీసుకున్నాకే పేదలు ఇల్లు నిర్మించుకున్నారని ఆమె తెలిపారు. కనీసం వారికి సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి ఇళ్లను కూలదోయడం బాధాకరమన్నారు. దీనిని ప్రశ్నించడానికి వెళ్లిన తనపై పోలీసులు అనరాని మాటలు అనడమే కాకుండా.. సీఐ మల్లికార్జున్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలు దాడి చేయడం దారుణమన్నారు. ఈ క్రమంలో తన కాలికి గాయమై చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. 

గత ఎన్నికలలో కూడా తుమ్మలగుంటలో తనపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాడి చేయించారని అన్నారు. ఈ ఘటనపై తిరుపతి ఎస్పీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. మహిళలపై పోలీసుల చేత దాడులు చేయించడం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తనపై దాడి చేసిన సీఐలు మహేశ్వరిరెడ్డి, మల్లికార్జునరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.