సీఎం జగన్‌కు దమ్ముంటే గుంటూరులో పోటీ చేయాలి: టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ - Pemmasani challenge to CM Jagan - PEMMASANI CHALLENGE TO CM JAGAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 12, 2024, 12:22 PM IST
TDP Leader Pemmasani Chandrasekhar Election Campaign in Guntur : సీఎం జగన్‌కు దమ్ముంటే గుంటూరు వచ్చి పోటీ చేయాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సవాల్ విసిరారు. అందుకు తాను సిద్ధమని బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంలో తాడికొండ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఆయనతో పాటు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దామరపల్లి, పొన్నెకల్లు గ్రామాల్లో రోడ్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గుంటూరు ప్రజలకు అభివృద్ధి కావాలి, కానీ అరాచకం కాదు అని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని ఓడిస్తే రాష్ట్రంలో తనకు ఇక తిరుగు ఉండదనే పిచ్చి భ్రమలో జగన్ ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ పార్టీని అంతమొందించడం ఎవరి వల్ల సాధ్యం కాదని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్‌కు తామంతా ఉక్కు కవచంలా నిలబడతామన్నారు. గుంటూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థులుగా నలుగురిని మార్చారని, వాళ్లు, వీళ్లు ఎందుకు దమ్ముంటే జగన్నే వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు.