తప్పుడు జీవోల త్రీడీ సినిమాకు నిర్మాత జగన్, దర్శకత్యం ఆదిమూలపు సురేష్: పట్టాభి - AP Loans
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 3:47 PM IST
TDP Leader Pattabhi on YCP Govt Irregularities: అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియాలో గత ప్రభుత్వం చేపట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల బహుళ అంతస్తుల నివాసాలు పూరైనట్లు వైసీపీ సర్కారు జీవోలు ఇవ్వడం దారుణమని తెలుగుదేశం నేత పట్టాభి మండిపడ్డారు. అనుకున్న సమయానికి నిర్మాణాలు పూర్తి చేయకుంటే తీసుకున్న రూ. 1,950 కోట్ల రుణాన్ని వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించాల్సి వస్తుందని కొత్త నాటకానికి తెర తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్పీఏ ప్రమాదం నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు అధికారులు అడ్డగోలుగా జీవోలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.
రాష్ట్ర పరువును మంటగలిపేలా వ్యవహరించిన అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు నిర్మాణమే పూర్తికాని, మనుషులే లేని భవనాల్లో అధికారులు ఉంటున్నట్టు తప్పుడు జీవోలతో జగన్ మోసపు రెడ్డి ప్రభుత్వం బ్యాంకులకు త్రీడీ సినిమా చూపించిందని దుయ్యబట్టారు. ఆ త్రీడీ సినిమాకు నిర్మాత జగన్ మోసపు రెడ్డి అయితే, దర్శకత్యం మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అని ఆరోపించారు. బ్యాంకుల యాజమాన్యాలు వాస్తవాలు తెలుసుకొని, జగన్ మోసపు రెడ్డి అండతో తప్పుడు జీవోలిచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కోరారు.