ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే టీడీపీ లక్ష్యం: లోకేశ్ - Nara Lokesh Zoom Meet in Doctors - NARA LOKESH ZOOM MEET IN DOCTORS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 15, 2024, 9:24 AM IST
TDP Leader Nara Lokesh Zoom Meet with Doctors: రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఆర్థిక భారం పడకుండా మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలన్నది తెలుగుదేశం పార్టీ విధానమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశల వారీగా యూనివర్సల్ హెల్త్ కేర్ విధానాన్ని అమల్లోకి తీసుకోస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఆరోగ్యంపై చైతన్యం తీసుకువస్తామని కేరళ తరహాలో నర్సింగ్ విద్యను ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రజలను చైతన్యవంతం చేయడంలో డాక్టర్లు కీలకపాత్ర వహించాలని పిలుపునిచ్చారు.
యూనివర్సల్ హెల్త్ కవరేజి సౌకర్యం కల్పించాలని, హెల్త్ బడ్జెట్‌ను పెంచాల్సిన అవసరం ఉందని డాక్టర్లు లోకేశ్‌కు తెలిపారు. 80 శాతానికి పైగా ప్రజలకు సేవలందిస్తున్న చిన్న, మధ్య తరహా ఆసుపత్రుల లైసెన్సింగ్ విధానాన్ని సరళీకరించాలని వైద్యులు కోరారు. మధ్య తరగతి ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యేక ఇన్సూరెన్స్‌ను అమలు చేయాలని వైద్యులు విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్నస్పెషలిస్టు వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.