సీఎం జగన్‌ కులాల మధ్య చిచ్చుపెడుతూ కొత్త నాటకానికి తెరతీశారు: నాగుల్‌మీరా

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 3:14 PM IST

TDP Leader Nagulmeera Fire on CM Jagan: కులాల మధ్య చిచ్చుపెడుతూ సీఎం జగన్(CM Jagan) కొత్త నాటకానికి తెరలేపారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నాగుల్‌మీరా ధ్వజమెత్తారు. జగన్ బీసీ(BC), ఎస్సీ(SC), ఎస్టీ(ST), మైనార్టీ(Minority) వర్గాల ద్రోహి అని మండిపడ్డారు. బీసీలకు రావాల్సిన నిధులు, పదవులను వారికి అందకుండా చేశారని ఆరోపించారు. జగన్‌ ప్యాలెస్‌(Jagan Palace)లో, ఆయన కుమార్తెలు లండన్‌(London)లో ఉన్నారని, బీసీ బిడ్డలు మాత్రం రోడ్ల(Roads)పై ఉన్నారని నాగుల్‌మీరా మండిపడ్డారు.

"ముఖ్యమంత్రి జగన్ కులాల మధ్య చిచ్చుపెడ్తూ కొత్త నాటకానికి తెరతీశారు. నా బీసీలు అంటూ కులాల మధ్య చిచ్చుపెడ్తున్నారు. జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ద్రోహి. బీసీ కార్పొరేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు. బీసీలకు రావల్సిన నిధులు కొల్లగొట్టారు. జగన్‌ పాలనలో బీసీలకు రక్షణ లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు పెరిగిపోయాయి." - నాగుల్‌మీరా, టీడీపీ అధికార ప్రతినిధి

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.