వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దళితులు గుణపాఠం చెప్పాలి : మహాసేన రాజేష్ - TDP Leader Mahasena Rajesh
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 12:45 PM IST
TDP Leader Mahasena Rajesh Fires on CM Jagan : దళితులను అణగదొక్కుతూనే దళితులంతా నా పక్షమే అని ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని రాష్ట్ర టీడీపీ మాల సాధికార అధికార ప్రతినిధి సరిపెల్ల రాజేష్ (మహాసేన రాజేష్) కోరారు. ఈ నెల 3న కాకినాడలో జరిగే దళితుల సమావేశం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అనేక వర్గాలు రాజకీయంగా ఎదుగుతున్నా మేలు చేసే వారివైపు దళితులు లేకపోవడం వలన రాజకీయంగా ఎదగలేపోతున్నారని అన్నారు. డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నాయకుడు తాడి నరసింహారావు ఇంటి వద్ద జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్య క్షుడు పొద్దోకు నారాయణరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మహాసేన రాజేష్ మాట్లాడారు
సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, ఉపాధి అవకాశాల్లో దళితులకు అన్యాయం చేస్తున్నారని రాజేష్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో దళితులంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.