యువగళం పాదయాత్రకు అక్షరరూపం- "శకారంభం" పేరుతో పుస్తకం - Lokesh Launch Sakarambham Book
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 2:21 PM IST
TDP Leader Lokesh was Launched by Sakarambham Book: యువగళం పాదయాత్రకు అక్షర రూపమిస్తూ సీనియర్ జర్నలిస్టు పెమ్మరాజు కృష్ణకిషోర్ రచించిన "శకారంభం" పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆవిష్కరించారు. యువగళం పాదయాత్ర 97 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 226 రోజులపాటు నిర్వహించామని అన్నారు. పాదయాత్రకు అక్షర రూపమిచ్చిన మిత్రుడు కృష్ణకిషోర్కు లోకేశ్ అభినందనలు తెలిపారు. యువగళం ప్రధాన ఘట్టాలను 'రైజ్ యువర్ వాయిస్' యూట్యూబ్ ఛానల్ ద్వారా కృష్ణకిషోర్ ప్రజలకు చేరవేశారని లోకేశ్ గుర్తు చేశారు. శకారంభం పుస్తక ప్రచురణకర్త బొడ్డు వెంకటరమణ చౌదరితోపాటు పుస్తకరచనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ లోకేశ్ అభినందనలు తెలియజేశారు.
టీడీపీ అధికారంలోకి రాగానే బోధనా రుసుముల చెల్లింపుల్లో పాత విధానాన్ని అమలు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. చినకాకానిలో అపార్టుమెంట్ వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధమని సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. మండుటెండల్లోనూ రోజుకు మూడు సభల్లో పాల్గొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు యువకుడిలా తిరుగుతున్నారని ఏసీ బస్సుల్లో తిరుగుతున్న సీఎం మాత్రం మూడు రోజులకు ఒకసారి విరామం తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.