విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించిన పాపం వైసీపీ ప్రభుత్వానిదే: కొల్లు రవీంద్ర - టీడీపీ నేత కొల్లు రవీంద్ర

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 5:07 PM IST

TDP Leader Kollu Ravindra Fires on YCP Government: వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించి​ విద్యాదీవెన పేరిట విద్యార్థులను మోసం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి రోజురోజుకూ హీన స్థితికి చేరుతుందని రవీంద్ర విమర్శించారు. విద్యాదీవెన పేరిట విద్యార్థులకు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి రూ.3400 కోట్లు ఎగనామం పెట్టారని ఆయన ఆరోపించారు. జగన్ దోపిడీ విధానాల వల్ల రాష్ట్రం నాశనం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో ఏటా 16లక్షల మంది విద్యార్థులకు బోధనా రుసుములు చెల్లించగా దానిని జగన్​ ప్రభుత్వం కేవలం 9లక్షల మందికే పరిమితం చేసిందని మండిపడ్డారు. 

టీడీపీ హయాంలో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్ర విద్యారంగాన్ని జగన్ పాలనలో అధమ స్థాయికి దిగజార్చారని రవీంద్ర ఆక్షేపించారు. ప్రమాణాలు లేని వ్యవస్థలు రాష్ట్రంలో ఉండటం వల్ల ఎందరో విద్యార్థులు బోధన రుసుములు కోల్పోతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 50వేల ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలపై జగన్ ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన దానికంటే సగం కూడా ఖర్చు చేయకుండా విద్యార్థులను మోసం చేయటం అన్యాయమని రవీంద్ర పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే 26వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తానన్న హామీని ఎందుకు అమలు చేయలేదో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.