జగన్ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తాననే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలి: మాణిక్య వరప్రసాద్ - TDP Leader fire on CM Jagan - TDP LEADER FIRE ON CM JAGAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 27, 2024, 2:46 PM IST
TDP Leader Dokka Manikya Vara Prasad Fires on CM Jagan : దురాశ దుఃఖానికి చేటు అనే సామెత తన విషయంలో నిజమైందని వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు. వైఎస్సార్సీలో తనను ఘోరంగా అవమానించినందునే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేశానని తెలిపారు. టీడీపీలో చేరినానంతరం డొక్కా మాణిక్య వరప్రసాద్ శనివారం రాజధానిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి రైతులు ఆయన్ను ఘనంగా స్వాగతించారు.
YSRCP Manifesto 2024 : తాడికొండ సీటు విషయంలో ముఖ్యమంత్రి జగన్ తనకు అన్యాయం చేశారని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు నుంచి తాడికొండ సీటు తనకే కేటాయిస్తున్నామని, చెప్పిన పార్టీ నేతలు చివరి నిమిషంలో సుచరితకు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ విషయంలోనూ తాను అసంతృప్తికి గురవలేదని అన్నారు. రాజకీయ భవిష్యత్తుపై పార్టీ నేతలు ఎలాంటి హామీ ఇవ్వకపోగా తనను ఘోరంగా అవమానించారని ఆయన ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగతంగా అవమానించడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని డొక్కా తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పార్టీ మేనిఫెస్టో (YSRCP Manifesto 2024)లో ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు అపాయింట్మెంట్ ఇస్తాననే అంశాన్ని చేర్చాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు.