చర్చిలో వైసీపీ అభ్యర్థుల ప్రచారం - వారిపై ఈసీకి టీడీపీ నేత ఫిర్యాదు - YCP candidate Violate Election Code
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 2, 2024, 10:57 AM IST
TDP leader Dhulipalla Narendra Kumar Complaint to Election Commission : మతపరమైన స్థలాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కానీ వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల సంఘం నియమాలను పెడచెవిన పెడుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థులు ఎన్నికలు సంఘం నియమాలను ఉల్లంఘించడంతో తెలుగుదేశం పార్టీ నేత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే,
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం పాత పొన్నూరులోని లూథరన్ ప్రార్ధన మందిరంలో ఆదివారం ఈస్టర్ పండగ జరిగింది. ఈ సందర్భంగా చర్చిలో వైఎస్సార్సీపీ చెందిన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య, పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులు కావాలని మరోసారి తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని తమని మరోసారి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘించడమేనని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సంబంధిత వీడియోలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.