ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు పట్టిన గతే వైసీపీకి: బుద్దా వెంకన్న - Buddha Venkanna counter to CM Jagan - BUDDHA VENKANNA COUNTER TO CM JAGAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 30, 2024, 4:07 PM IST
TDP leader Buddha Venkanna Counter to CM Jagan: వచ్చే ఎన్నికల తర్వాత వైసీపీకి బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. చంద్రబాబు జైలుకెళ్తే చులకనగా మాట్లాడిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. చంద్రబాబుకు పేదల ఆశీస్సులున్నాయని తెలిపారు. జగన్ 2 లక్షల షర్ట్, 1 లక్ష చెప్పులు వాడతారని ఆరోపించారు. తాము 2 వేల షర్ట్, వేయి విలువైన చెప్పులు వాడతామని అన్నారు. అత్యంత ధనికురాలైన బుట్టా రేణుక పేద మనిషని జగన్ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. బుట్టా రేణుకను పేదరాలి అంటే అంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా అని బుద్దా వెంకన్న నిలదీశారు.
2014లో తెలుగుదేశం అన్న క్యాంటీన్ తీసుకువస్తే, సీఎం జగన్ దానిని అర్థాంతరంగా తొలగించారని తెలిపారు. పేదల కోసం విదేశి విద్య పథకాన్ని తీసుకువస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక విదేశి విద్య పథకాన్ని రద్దు చేశారని విమర్శించారు. సీఎం జగన్ మాత్రం తన పిల్లల్ని లండన్లో చదివిస్తున్నారని ఎద్దేవా చేశారు. గత పాలనలో మంచి మద్యం బ్రాండ్లను ప్రోత్సహిస్తే, సీఎం జగన్ కల్తీ బ్రాండ్లను ప్రోత్సహించారని తెలిపారు. లిక్కర్ తాగమని టీడీపీ ప్రోత్సహించలేదని, కానీ పేదవాడి ఆరోగ్యంతో టీడీపీ ఆటలాడలేదని తెలిపారు.