టిక్కెట్ రాలేదని చంద్రబాబుని విమర్శిస్తే తాట తీస్తా: బుద్ధా వెంకన్న - Buddha Venkanna Application To Babu
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-02-2024/640-480-20640522-thumbnail-16x9-tdp-leader-buddha-venkanna-application-to-chandra-babu.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 4:03 PM IST
TDP Leader Buddha Venkanna Application To Chandra Babu: విజయవాడ వెస్ట్ నియోజకవర్గం లేదా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి టిక్కెట్ కేటాయించాలని టీడీపీ నేత బుద్ధా వెంకన్న చంద్రబాబుకు వినతి చేశారు. చంద్రబాబు ఇచ్చే దరఖాస్తును బుద్ధా అమ్మవారి ఎదుట ఉంచి ఆశీర్వాదాలు కోరారు. టిక్కెట్ కేటాయించాలని చంద్రబాబు - పవన్ కల్యాణ్ ఇద్దరినీ బుద్ధా వెంకన్నకోరారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తానని బుద్ధా స్పష్టం చేశారు. వెంకన్నకు టిక్కెట్ ఇవ్వాలని దుర్గమ్మ గుడి వరకు పార్టీ శ్రేణులు కలిసి ఉరేగింపు నిర్వహించారు.
Buddha Venkanna Rally In Vijayawada: టిక్కెట్ రాలేదని ఎవరైనా చంద్రబాబుని విమర్శిస్తే తాట తీస్తానని హెచ్చరించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని బుద్దా వెంకన్న తెలిపారు. టీడీపీతో పొత్తు ఉన్న వారిని, టీడీపీ నేతలను, వారి కుటుంబాన్ని దూషిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతి రోజు వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.