LIVE: రాబోయే ఎన్నికల కోసం వాలంటీర్లకు అవార్డులు పేరుతో జగన్ రెడ్డి పాట్లు- టీడీపీ నేత బొండా ఉమా లైవ్ - TDP Leader Bonda Uma Live
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 12:17 PM IST
|Updated : Feb 16, 2024, 12:22 PM IST
TDP Leader Bonda Uma Media Conference Live: సీఎం జగన్ వాలంటీర్లకు వందనం కార్యక్రమంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు.రాబోయే ఎన్నికల కోసం వాలంటీర్లకు అవార్డులు పేరుతో జగన్ రెడ్డి పడరాని పాట్లు పడుతున్నారను వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా విజయవాడలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. 25 రకాల పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని చెప్పేందుకు గర్వపడుతున్నానన్నారు. ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా కేవలం సేవ చేయాలనే తపనతో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారని సీఎం ప్రశంసించారు.
ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను సత్కరించారు. ప్రభుత్వ పెన్షన్లను 64లక్షల మంది లబ్దిదారులకు అందిస్తున్న గొప్ప సేవకులు, సైనికులు వాలంటీర్లను జగన్ కొనియాడారు. 2019 నుంచి 2లక్షల 66వేల మంది వాలంటీర్లు ప్రజలకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వాలంటీర్లు ప్రజలకు మంచిని అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంపై టీడీపీ నేత బోండా ఉమా మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.