కేశినేని నాని అప్పుల అప్పారావు - ఆయన చేసిన సేవ ఏంటి ?: బొండా ఉమా - ap latest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 13, 2024, 3:29 PM IST
TDP Leader Bonda Uma Fire on Kesineni Nani: కేశినేని నానిపై తెలుగుదేశం నేత బొండా ఉమా విరుచుపడ్డారు. కేశినేని పెద్ద బ్యాంకు స్కామర్, అప్పుల అప్పారావు అని విమర్శించారు. టీడీపీ హయాంలో సేవ చేసి అప్పుల పాలయ్యానని కేశినేని చెబుతున్నారని, ఏం సేవ చేశారో చూపించాలని ఆయన ప్రశ్నించారు. అన్ని చోట్లా అప్పులు చేసి అంబానీలా బిల్డప్‌లు ఇస్తున్నారని బొండా ఉమా ఎద్దేవా చేశారు. కేశినేని నాని మీడియాలో అబద్ధ ప్రచారాలు చేస్తున్నారన్న ఆయన, టీడీపీలో మొట్ట మొదటిసారి ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఆయన ఆస్తి సుమారు రూ. 37 కోట్లు కాగా, అప్పులేమో రూ. 66 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్ (Election Affidavit)లో ఉన్నాయని వెల్లడించారు.
"కేశినేని నాని పెద్ద బ్యాంక్ స్కామర్, ఒక అప్పుల అప్పారావు. కేశినేని నాని మీడియాలో అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో సేవ చేసి అప్పుల పాలయ్యానని కేశినేని చెబుతున్నారు. అయితే ఆయన చేసిన సేవ ఏంటో చూపించాలి ?" - బొండా ఉమా, టీడీపీ నేత