ఎమ్మెల్యే గోపిరెడ్డి భూఅక్రమాలను ఆధారాలతో నిరూపిస్తా - చదలవాడ అరవిందబాబు - mla gopireddy srinivasa reddy

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 12:12 PM IST

TDP leader Aravinda Babu Complaint: పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూఆక్రమణలపై విచారణ జరిపించాలని టీడీపీ నేత చదలవాడ అరవింద బాబు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చదలవాడ అరవింద బాబు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూఆక్రమణలపై విచారణ జరిపించాలని చదలవాడ అరవిందబాబు డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో గోపిరెడ్డి అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. నాలుగున్నరేళ్లుగా గోపిరెడ్డి భూ ఆక్రమణలపై సాక్ష్యాలతో సహా కలెక్టర్​ను కలిశామన్నారు. ఆక్రమణకు గురైన భూముల దస్తావేజులను కలెక్టర్​కు అందజేశామని తెలిపారు. భూఆక్రమణలపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చదలవాడ అరవిందబాబు వెల్లడించారు. గోపిరెడ్డి భూఅక్రమాలు సాక్ష్యాలతో నిరూపిస్తానని సవాల్‌ విసిరారు. భూదందాలతో సహా గుట్కా, గంజాయి స్మగ్లింగ్‌లో గోపిరెడ్డి హస్తముందని అరవిందబాబు ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.