బీజేపీ కాళ్లపై పడటం వైసీపీకి అలవాటు కానీ టీడీపీకి కాదు: అచ్చెన్నాయుడు - TDP leader Achchennaidu
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2024/640-480-20697208-thumbnail-16x9-tdp-achenna-on-ycp-posts.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 1:15 PM IST
TDP leader Achenna angry on YCP fake posts: బీజేపీ కాళ్లపై పడటం, మొక్కటం వైసీపీ సంస్కృతే కానీ తెలుగుదేశానికి ఆ అవసరం లేదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (TDP state president Achchennaidu) స్పష్టం చేశారు. అనేక కేసుల్లో ఏ1 ముద్దాయిగా జగనే వీటికి పాకులాడతాడంటూ దుయ్యబట్టారు. వైసీపీ ఫేక్ పోస్టులను ఊరికే వదిలిపెట్టమని హెచ్చరించారు.
అమిత్‌షా పిలుపు మేరకే చంద్రబాబు దిల్లీ (Chandrababu met Amit Shah) వెళ్లారని తెలిపారు. అక్కడి పరిణామాలపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా, అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉంటుంది కానీ జగన్‌లా వ్యక్తిగత స్వార్ధం కోసం ఉండదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వైసీపీ అరాచక పాలనకు సమయం దగ్గర పడిందని అన్నారు. ప్రజలు త్వరలోనే జగన్‌ను గద్దె దించుతారని అన్నారు. వచ్చేది ఎలాగైనా టీడీపీ- జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అప్పుడు ఎవ్వరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.