కార్మికుడి ఆత్మగౌరవానికి, జగన్ అహంకారానికి మధ్య పోరాటం: టీఎన్టీయూసీ
🎬 Watch Now: Feature Video
TDP Karmika Chaitanya Bus Yatra: రాష్ట్రంలో కార్మికుడి ఆత్మగౌరవానికి, సీఎం జగన్ అహంకారానికి మధ్య పోరాటం జరుగుతోందని ఈ పోరాటంలో అంతిమంగా కార్మికుడి ఆత్మగౌరం గెలుస్తుందని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు అన్నారు. కార్మికుల్లో చైత్యనం కోసం టెక్కలి నుంచి కుప్పం దాకా టీఎన్టీయూసీ చేపట్టిన చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర అనంతపురం చేరుకుంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తనయుడు మధుకర్ చౌదరి పాల్గొన్నారు. అనంతరం బహిరంగసభలో రఘురామరాజు మాట్లాడుతూ 2014 నుంచి 19 వరకు కార్మికులు ఎలా ఉండే వారు 2019 నుంచి నేటి వరకు వారి పరిస్థితి ఏంటన్నది కార్మికులకు వివరిస్తున్నామన్నారు.
యువగళం పాదయాత్రలో లోకేశ్ అనేక హామీలు ఇచ్చారని వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. లక్షలాది మంది భవన నిర్మాణ, రవాణారంగ కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ఈ ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు ఇలా అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారన్నారు. తమకు ముద్దులు పెట్టే వాడు కాదని, ముద్ద పెట్టే వాడు కావాలని కార్మికులు కోరుకుంటున్నారన్నారు. అందుకే ఈ జగన్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు, కార్మికులు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.