విదేశాల్లో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు - ప్రముఖ నగరాల్లో కార్ల ర్యాలీ - Chandrababu Birthday Celebrations - CHANDRABABU BIRTHDAY CELEBRATIONS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 21, 2024, 2:04 PM IST
TDP Chief Chandrababu Naidu Birthday Celebrations in Abroad : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అలాగే దేశ విదేశాల్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. బాబు హయాంలో లబ్ధి పొంది వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ నేత కిషోర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అగ్రగామిగా నిలవాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. యూకేలోని బర్మింగ్‌హామ్, కోవెంట్రీ నగరాల్లో కార్ల ర్యాలీతో కోలాహలంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి అధినేతపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
HBDBabu Hashtag Trending : చంద్రబాబుకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. #HBDBabu హ్యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా ఎక్స్‌లో 1వ స్థానంలో ట్రెండ్ అయ్యింది. అదే విధంగా #HBDCBN, #CBNBIRTHDAYCDP కూడా ట్రెండ్ అయింది. చంద్రబాబు జన్మదినం సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు పోస్టుల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.