"సీఎం హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడం రాజకీయ లబ్దికోసమే" - సీఎం జగన్ అద్దెకు హెలికాప్టర్లు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 8:51 AM IST
TDP AP Cheif Atchannaidu: జగన్ కోసం రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవాలనే నిర్ణయాన్ని నిలిపి వేయాలని కోరుతూ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు. రెండు హెలికాప్టర్లకు అద్దెకు తీసుకుని నెలకు 3 కోట్ల 84 లక్షల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తారా అని లేఖలో ప్రశ్నించారు. జగన్ రెడ్డి తన పార్టీ ప్రచారం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికల నియమావళి ప్రకారం పార్టీ ప్రచారం కోసం ఎయిర్ క్రాప్ట్ లతో సహా ప్రభుత్వ వాహనాలు వాడరాదని లేఖలో తెలిపారు. హెలికాప్టర్లు అద్దెకు తీసుకోవడం రాజకీయ లబ్దికోసం తప్ప మరోటి కాదని వెల్లడించారు.
ఈ నిర్ణయం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ మెంట్ బెనిఫిట్స్, జీపీఎఫ్, మెడికల్ బిల్లులు చెల్లించలేని ప్రభుత్వం హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడం ప్రజాభీష్టానికి వ్యతిరేకమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ కొన్ని వారాల్లో వస్తుందని, అలాంటి సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఎన్నికల నియమావళిని ఉల్లఘించడమేనని అన్నారు.