వైసీపీ ఎన్నికల తాయిలాలపై కలెక్టర్ పట్టించులేదు- తిరుపతి కలెక్టర్‌పై ఎన్టీఏ నేతల ఫిర్యాదు - TDP LEADERS Complaint to CEO on
🎬 Watch Now: Feature Video
Complaint to CEO on Tirupati Collector : తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు పలు అంశాలపై ఎన్నికల సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఓ ప్రైవేటు గోదాంలో అధికార వైఎస్సార్సీపీ నేతలు ఓటర్లుకు పంచి పెట్టేందుకు తాయిలాలను దాచి ఉంచారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తిరుపతి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావునా కలెక్టర్‌ను తక్షణమే మార్చాలని ఎన్నికల సీఈఓకి నేతలు ఫిర్యాదు పేర్కొన్నారు. ఇంత ఏకపక్షంగా కలెక్టర్ వ్యవహరిస్తే ఆయన పారదర్శకంగా ఎన్నికలు ఎలా నిర్వహించ గలరని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓటర్లకు తాయిలాలు ఇస్తూ చివరి నిమిషంలో గెలవాలని వైఎస్సార్సీపీ ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. కొందరు అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని నేతలు విమర్శించారు.
సీఎస్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ : ఎన్నికల విధుల్లో గతంలో ఎనాడూ దేవాలయాల ఈవోలను, అదనపు కమిషనర్లను నియమించలేదని ఎన్డీఏ నేతలు ఎన్నికల సీఈఓకు తెలిపారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలకు ఆటంకం కలిగేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కావల్సిన వాళ్ళను ఎన్నికల విధుల్లో నియమించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ పోలీసులను నియంత్రించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై సీఎస్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.