అందరం కలిసి పనిచేద్దాం - వ్యక్తిగతం కంటే ప్రజా శ్రేయస్సే ముఖ్యం: ఆలపాటి రాజా - TDP Alapati Raja Comments - TDP ALAPATI RAJA COMMENTS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 23, 2024, 10:24 AM IST
TDP Alapati Raja Comments on Penamaluru: పార్టీ చెట్టు లాంటిదని, చెట్టు సక్రమంగా ఉంటేనే ఆ నీడన మనం మనగలుగుతామని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటి తర్వాత ఆయన తెనాలిలోని ఓ కల్యాణ మండపంలో టీడీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు.
గతంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుంచుకొని కలిసి పనిచేద్దామని, అలా పనిచేయలేని పక్షంలో నాయకత్వం నుంచి తప్పుకుంటానని తెలిపారు. టీడీపీ తరఫున అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఎక్కడో ఓచోట అవకాశం వస్తుందని భావించానన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రతి చోటా సర్వే అనుకూలంగా ఉన్నా అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెనమలూరు సీటు బోడె ప్రసాద్‌కు ఇవ్వడం న్యాయమని వ్యాఖ్యానించారు. చివరి నిమిషం వరకు పోరాడాలని భావనతో సీటు కోసం ప్రయత్నించానని స్పష్టం చేశారు. తన వ్యక్తిగతం కంటే కూడా పార్టీ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సే ముఖ్యమని స్పష్టం చేశారు. తన నాయకత్వం అవసరం లేదని కార్యకర్తలు భావిస్తే తప్పుకుంటానని ప్రకటించారు.