తుపాకీతో వైసీపీ నేత కవ్వింపు- ఆగ్రహంతో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు - High Tension in Tadipatri - HIGH TENSION IN TADIPATRI

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 20, 2024, 10:52 PM IST

Tadipatri Tension Due to Provocative Actions of YSRCP Leaders : అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఊర్లో అడుగుపెట్టగానే వైఎస్సార్సీపీ శ్రేణలు రెచ్చిపోయాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టేలా వైఎస్సార్సీపీ నేతలు కవ్వింపులకు పాల్పడ్డారు. దీంతో రౌడీ షీటర్‌ అయిన రఫీపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. కందిగోపుల మురళి అనే వైఎస్సార్సీపీ నాయకుడు, టీడీపీ కార్యకర్తలను మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించాడు. ఆగ్రహించిన తెలుగుదేశం కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేసి ఫర్నీచర్‌, కార్లు, ద్విచక్రవాహనాలు ధ్వంసం చేశారు. 

ఈ ఘటనలతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రాగానే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వైఎస్సార్సీపీ నేతలు వారి అనుచరులను పంపారని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం పంపించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి పంపినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.