కూటమి గెలుపు కోసం స్వామీజీల విజయ శంఖారావం యాత్ర - Siva Swamy Sankharavam
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 15, 2024, 5:04 PM IST
Swamiji Dharmica conference at Vijayawada: రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించాలని కోరుతూ స్వామీజీల ధార్మిక సదస్సును ఏర్పాటు చేశారు. విజయవాడ అటల్ బిహారీ సమావేశ మందిరంలో శైవ పీఠాధిపతి శివస్వామి 'జయహో భారత్ ధర్మం గెలుస్తుంది' పేరుతో విజయ శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శైవ పీఠాధిపతి శివ స్వామి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించాలని విజయ శంఖారావం యాత్ర ప్రారంభించామన్నారు. బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని ఈ ప్రచార యాత్రలను చేపట్టినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కమలం పార్టీని, రాష్ట్రంలో బీజేపీ కూటమిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
రానున్న ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏకు 375 సీట్లు రావాలని రాష్ట్రంలో ఉమ్మడి పొత్తుతో వెళ్తున్న మూడు పార్టీలు అధికారం చేపట్టాలని విజయ శంఖారావం యాత్రకు శ్రీకారం చుట్టాం. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో ఉన్నతమైన ప్రభుత్వం ఏర్పడి సమాజానికి ధైర్యాన్ని, భద్రతా భరోసాను ఇవ్వాలి. -శివ స్వామి, శైవ పీఠాధిపతి