విశాఖ గీతం వర్సిటీలో 'చలన చిత్రం' - అలరించిన 'సుందరం మాస్టర్' టీమ్ - సుందరం మాస్టర్ టీమ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 7:07 PM IST
Sundaram Master Team At Vizag's Biggest Film Festival Chalana Chitram : సినిమాలు చేసే వాళ్లను ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశ్యంగా జీ స్టూడియో ఆధ్వర్యంలో విశాఖలోని గీతం కాలేజ్ విద్యార్థులు 'చలన చిత్రం' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలేజీలో క్లబ్‌గా మొదలై ఫిల్మ్ ఫెస్టివల్‌గా (Film Festival) దీన్ని ముందుకు నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు చలన చిత్రం బృందం విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమానికి వైవా హర్షాగా (Viva Harsh) ప్రేక్షకులకు సుపరిచితుడైన హర్ష చెముడు హీరోగా నటించిన 'సుందరం మాస్టర్' చిత్ర బృందం వచ్చి అలరించింది. అంతే కాకుండా ఈ కార్యక్రమం ద్వారా వారు తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.
కెమెరా వర్క్, డైరెక్షన్, స్టేజ్ ప్లే వంటి వాటిపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి ప్లాట్‌ఫాం అని నిర్వాహకులు తెలిపారు. ఈ సారి చలన చిత్రం నిర్వహించిన పలు పోటీల్లో మూడు వందలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఫొటో షూటింగ్, షాట్ ఫిల్మ్ మేకింగ్ పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు (Gifts) అందించారు.