బస్సు నడుపుతుండగా గుండెపోటు - స్టీరింగ్‌పైనే పడిపోయిన డ్రైవర్ - Hyderabad RTC Driver Heart Attact
🎬 Watch Now: Feature Video
Published : Feb 18, 2024, 1:59 PM IST
Sudden Heart Attack In Hyderabad : ఇటీవల కాలంలో గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అప్పటి వరకు ఆరోగ్యంగా మన కళ్ల ముందు తిరిగిన వారు, క్షణాల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనల్లో ఎక్కువగా యువకులే బాధితులుగా ఉంటున్నారు. తాజాగా బస్సు నడుపుతుండగానే డ్రైవర్ గుండెపోటుతో స్టీరింగ్‌పైనే కుప్పకూలాడు. ఈ ఘటన దేవరకొండ బస్ డిపోనకు చెందిన బస్సు నల్గొండ జిల్లా మల్లేపల్లి నుంచి హైదరాబాద్ వస్తుండగా జరిగింది. డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
RTC Driver Heart Attack : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూర్ వద్ద జరిగిన ఘటనలో అనారోగ్యం పాలైన డ్రైవర్ శంకర్ నాయక్‌ను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌కు గుండెపోటు వచ్చిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా, అంతటి నిస్సహాయ స్థితిలోనూ వారందరి క్షేమం కాంక్షిస్తూ బస్సును రోడ్డు పక్కకు ఆపి స్టీరింగ్‌పైనే పడిపోయాడు.