ప్రైవేట్ పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ - 50 మంది విద్యార్థులకు అస్వస్థత - 50 Students Hospitalized In Nandyal - 50 STUDENTS HOSPITALIZED IN NANDYAL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 3, 2024, 12:47 PM IST
50 Students Hospitalized After Eating A Contaminated Food In Nandyal District : కలుషిత ఆహారం తిని నంద్యాల సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాల హాస్టల్లో 50 మంది విద్యార్థిని, విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల యజమాని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ ఆహారం తిన్న కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. వైద్యులను పిలిపించి హాస్టల్లోనే చికిత్స చేయించగా కొందరు కోలుకున్నారు. విషయం తెలుసుకున్న నంద్యాల ఆర్డీవో మల్లికార్జునరెడ్డి పాఠశాల హాస్టల్‌కు చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థులు కోలుకుంటున్నారని వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అస్వస్థకు గురైన విద్యార్థినీ, విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆర్డీవో సూచించారు. ఇక నుంచి అన్నీ హాస్టళ్లలో తనిఖీలు చేస్తామని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హాస్టల్ సిబ్బందిని హెచ్చరించారు. విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.