ETV Bharat / state

ఊడిన పైకప్పు పెచ్చులు, విరిగిన లైట్లు - ఎన్టీఆర్ ఘాట్​ నిర్వహణపై లోకేశ్ అసంతృప్తి - LOKESH ON NTR GHAT

ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ లోపంపై మంత్రి నారా లోకేశ్​ అసంతృప్తి - సొంతనిధులతో మరమ్మతులు చేపట్టాలని తన సిబ్బందికి ఆదేశాలు

LOKESH Comments ON NTR GHAT
LOKESH Comments ON NTR GHAT (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2025, 4:50 PM IST

Nara Lokesh On NTR Ghat: హైదరాబాద్​లోని ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ లోపంపై మంత్రి నారా లోకేశ్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంతనిధులతో మరమ్మతులు చేపట్టాలని తన సిబ్బందికి ఆదేశించారు. ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి హైదరాబాద్​లోని ఎన్టీఆర్ ఘాట్​కు ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్​ వెళ్లారు. ఘాట్ ఆవరణాల్లో గోడలు, పైకప్పు పెచ్చులు ఊడిపోవడం, గార్డెన్​లో ఏర్పాటు చేసిన లైట్లు విరిగిపడి ఉండటాన్ని లోకేశ్ గమనించారు.

అధికారుల తీరు పట్ల అభిమానులు ఆగ్రహం: ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన హెచ్ఎండీఏ అధికారుల తీరు పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘాట్ నిర్వహణ ఎన్టీఆర్ ట్రస్ట్​కు అప్పగించాలని గతంలో పలుమార్లు తెలంగాణ ప్రభుత్వానికి పలు విజ్ఞప్తి చేసింది. అవసరమైన అనుమతులు తీసుకొని వీలైనంత తొందరగా ఘాట్ మరమ్మతులు సొంత నిధులతో పూర్తి చేయాలని లోకేశ్ నిర్ణయించారు. త్వరితగతిన పనులు ప్రారంభించాలని తన సిబ్బందిని ఆదేశించారు.

NTR Vardhanthi 2025 : టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు. ఆయన మరణించి నేటికి 29 ఏళ్లు గడిచిన సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ ఘాట్​కు చేరుకుని అంజలి ఘటించారు. నటనలో ప్రయోగాలు చేసిన నటనా ప్రావీణ్యుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ కొనియాడారు.

నందమూరి తారక రామారావు విప్లవాన్ని తీసుకొచ్చారని బాలకృష్ణ తెలిపారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్తుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందని పేదలకు ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం నవరసాలకు అలంకారమని చెప్పారు. నందమూరి తారక రామారావు అంటే ఒక వర్సిటీ అని జాతికి మార్గదర్శమని పేర్కొన్నారు. అటువంటి వారికి మరణం ఉండదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీని స్థాపించారని నందమూరి రామకృష్ణ వివరించారు. 9 నెలల్లోనే తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌ను సీఎం చేశారని గుర్తుచేశారు. ప్రాంతాలు వేరైనా తెలుగు వారంతా ఒకటేనని నందమూరి తారక రామారావు చాటారని చెప్పారు. మరోవైపు మంత్రి నారా లోకేశ్‌, నారా భువనేశ్వరి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించారు. నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు.

Lokesh Tribute at NTR Ghat Hyderabad : నాడు ఎన్టీఆర్‌ ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని మంత్రి లోకేశ్ గుర్తుచేశారు. అనేక సంస్కరణలు తెచ్చారని చెప్పారు. టీడీపీ కోటి మంది సభ్యత్వాలు తీసుకోవడం గర్వకారణమని తెలిపారు. తెలుగు జాతి ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలోకి ఎదగాలని ఆకాంక్షించారు. నందమూరి తారక రామారావు రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు. ఎన్టీఆర్‌ అనేది ఒక పేరు కాదని ప్రభంజనమని లోకేశ్ వెల్లండించారు.

'నారా లోకేశ్​పై ఫిర్యాదు ఉంది' - చర్చనీయాంశంగా మోదీ వ్యాఖ్యలు

నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ - రెండు సంస్థలతో ప్రభుత్వం ఎంవోయూ

మా ప్రభుత్వం స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌పై దృష్టి సారించింది : లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.