బైకులు, సెల్‌ఫోన్లు దొంగతనం కేసుల్లో మైనర్లే అధికం- ఒక్క విశాఖలోనే నెలరోజుల్లో 83 కేసులు - Stolen Objects Recovery Fair - STOLEN OBJECTS RECOVERY FAIR
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-06-2024/640-480-21617412-thumbnail-16x9-stolen-objects-recovery-fair-in-visakha.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 2, 2024, 4:15 PM IST
Stolen Objects Recovery Fair in Visakha: ద్విచక్ర వాహనాల దొంగతనం కేసుల్లో నిందితులుగా అధిక సంఖ్యలో మైనర్లే ఉన్నారని విశాఖ పోలీసులు వెల్లడించారు. దొంగతనానికి గురైన బైకులు, సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులతో రికవరీ మేళా నిర్వహించారు. మే నెలలో జరిగిన దొంగతనాల్లో నమోదైన 83 కేసుల్లో 57 కేసులు ఛేదించామని పోలీసులు తెలిపారు. ఇళ్లు, దుకాణాల్లో చోరీలకు తావివ్వకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. జైలు నుంచి విడుదలైన నేర ప్రవృతి ఉన్న వారిపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విశాఖ వాసులకు సూచించారు.
"మే నెలలో 83 దొంగతనాలకు సంబంధించిన కేసులు నమోదవ్వగా వాటిలో 57 కేసులను ఛేదించాం. ఇళ్లు, దుకాణాల్లో చోరీలకు తావివ్వకుండా చర్యలు చేపట్టాం. బైకుల దొంగతనం కేసుల్లో నిందితులుగా మైనర్లే అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇళ్లవద్ద ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి." - వెంకట రత్నం, డీసీపీ