ఒప్పంద కార్మికుల తొలగింపుపై స్టీల్ ప్లాంట్‌లో నిరసన - భారీగా మోహరించిన పోలీసులు - Workers protest in steel plant
🎬 Watch Now: Feature Video
Agitating workers at Visakha Steel Plant : విశాఖ ఉక్కు పరిశ్రమలో నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల పాసులను నిలిపేసిన చేసిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ( ED వర్క్ బిల్డింగ్ ) వద్ద కాంట్రాక్టు కార్మికులు నిరసన తెలిపారు. కాంట్రాక్టు కార్మికులను తొలగించే నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తామని వారు తెలిపారు.
ఒప్పంద కార్మికుల తొలగింపుపై కార్మికుల నిరసన: స్టీల్ ప్లాంట్ లో తొలగించిన 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్‌గా ఉన్న పర్మినెంట్ యెల్లో పాస్‌లను మంజూరు చేయాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ( ED వర్క్ బిల్డింగ్ ) వద్ద అఖిల పక్ష కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
కాంట్రాక్టు కార్మికులను తొలగించే నిర్ణయం వెనక్కు తీసుకునేవరకు ఉద్యమం ఆగదు: ఉక్కు ఉత్పత్తి లో కీలకంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను తొలగించడం అన్యాయమని వాపోయారు. ఉక్కు యాజమాన్యం అవలంబిస్తున్న తీరు వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. ఏ ప్రాతిపదికన కార్మికులను తొలిగించారో వెల్లడించాలని అన్నారు. ప్లాంట్ పునర్నిర్మాణానికి కావాల్సిన అంశాలను పక్కన పెట్టి కాంట్రాక్టు్ కార్మికులను తొలగించడం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. 7.3 మిలియన్ టన్నులకు ఎంత మంది కార్మికులు కావాలో ఉక్కు యాజమాన్యానికి తెలుసా? అని ప్రశ్నించారు. కార్మికులను తొలగించే నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం ఆపేదేలేదని స్పష్టం చేశారు.