లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవదు - మూణ్నెళ్లలో ఆ పార్టీ మూతపడబోతోంది : కడియం శ్రీహరి - Kadiyam Srihari Fires on KCR
🎬 Watch Now: Feature Video
Published : Apr 29, 2024, 8:40 PM IST
Kadiyam Srihari Fires on KCR : తెలంగాణ వనరులన్నీ దోచుకున్న కేసీఆరే అసలు మోసగాడని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. హనుమకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో కలిసి ఆయన పాల్గొన్నారు. వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేసిన కేసీఆర్, మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చారని విమర్శించారు. మూణ్నెళ్లలో గులాబీ పార్టీ మూతపడుతుందని జోస్యం చెప్పిన ఆయన మునిగిపోయే పార్టీ నావను రక్షించుకోవాలని హితవు పలికారు.
Teenamar Mallanna Comments on KCR : తన కుమార్తె కవిత లిక్కర్ స్కాంలో ఉన్నందుకు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీ నుంచి మెప్పు పొందాలని చూస్తున్నారని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే కాంగ్రెస్ గెలవాలన్న ఆయన, రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.