ఆర్టీసీకి మంచిరోజులు- 1400 బస్సుల కొనుగోలుకు సీఎం గ్రీన్ సిగ్నల్ : మంత్రి రాంప్రసాద్రెడ్డి - new busses for apsrtc - NEW BUSSES FOR APSRTC
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 1, 2024, 7:58 PM IST
new busses for apsrtc : రాష్ట్రంలో 1400 కి పైగా కొత్త బస్సుల కొనుగోలుతో ఆర్టీసీకి కొత్త జవసత్త్వాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీలోకి ప్రవేశ పెట్టడం ద్వారా ఆర్ధికంగా సంస్ధ బలోపేతం అయ్యే దిశగా చర్యలు చేపడతామని వివరించారు. విశాఖ డిపో నుంచి మూడు సూపర్ లగ్జరీ అంతర్ రాష్ట్ర సర్వీసులను ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి ప్రారంభించిన అనంతరం కార్మికులు ఆయనను సత్కరించారు.
ఈ సందర్భంగా కార్మికులకు భరోసా ఇస్తూ, ప్రయాణీకులు, సిబ్బంది ఆర్టీసికి రెండు కళ్లులాంటి వారని, ఈ రెంటిని కాపాడుకునే రీతిలోనే కూటమి ప్రభుత్వం చర్యలు ఉంటాయన్నారు. ఇప్పటికే కాలం చెల్లిన బస్సులతో డ్రైవర్ అన్నలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి దాని నుంచి గట్టెక్కించే దిశగానే తాము యోచన చేస్తున్నామన్నారు. ఉత్తమ సేవలందించిన ఆర్టీసి ఉద్యోగులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రశంసా పత్రాలను అందించారు.