పింఛనుదారులకు ప్రభుత్వం డీఆర్ మంజూరు - మూడు వాయిదాల్లో బకాయిలు చెల్లింపు - Government Grant DR For Pensioners
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 17, 2024, 12:39 PM IST
State Government Order DR Granting For Pensioners: ప్రభుత్వ పింఛనుదారులకు 2023 జనవరి, జులై డీఆర్‌ను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (state Government) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి, జులై డీఆర్ 3.64 శాతం చొప్పున ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి డీఆర్‌ను ఏప్రిల్ పింఛనుతో కలిపి మే నెలలో చెల్లిస్తామని పేర్కొంది. 2023 జనవరి నుంచి 2024 మార్చి 31 వరకు చెల్లించాల్సిన బకాయిలను మూడు సమాన వాయిదాల్లో ఈ ఏడాది ఆగస్టు, నవంబరు, 2025 ఫిబ్రవరిలో చెల్లిస్తామని వెల్లడించింది. 2023 జులై డీఆర్, పింఛను రెండు కలిపి ఈ ఏడాది ఆగస్టులో చెల్లిస్తామని వెల్లడించింది.
2023 జులై నుంచి 2024 జూన్ 30 వరకు చెల్లించాల్సిన డీఆర్ బకాయిలు మొత్తం మూడు సమాన వాయిదాల్లో సెప్టెంబరు, డిసెంబరు, 2025 మార్చిలో చెల్లిస్తామని ప్రభుత్వం వివరించింది. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఉద్యోగులకు డీఆర్‌ను మంజూరు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా వైసీపీ ప్రభుత్వం పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేసినా ఇంకా ఖాతాల్లో జమకాకపోవడం గమనార్హం.