అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎస్టీ కమిషన్ సభ్యుడు - jeelugumilli Tribal Welfare hostel

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 10:51 PM IST

ST Commission Member Visited Students: ఏలూరు జిల్లా జీలుగుమిల్లి ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో సోమవారం అస్వస్థతకు గురై జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్ నాయక్ మంగళవారం పరామర్శించారు. అధికారులతో కలిసి పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు.  విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, వైద్యుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులను ఆదేశించామని తెలిపారు. 

జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో 8 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని, వీరిలో ఇద్దరు విద్యార్థులకు గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారన్నారు. పిల్లల అస్వస్థత గల కారణాలను కమిటీ వేసి ఉన్నతాధికారులకు నివేదించాల్సిందిగా కోరటం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించి వారి వెంటనే కోలుకునే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆయన ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.