శ్రీకృష్ణాష్టమి శుభవేళ - నల్లనయ్యకు 135 రకాల ప్రసాదాలు - 135 Prasadam to lord Krishna

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2024, 5:33 PM IST

thumbnail
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో 135 రకాల పిండిపదార్థాలు (ETV Bharat)

Sri krishna Janmashtami Celebrations 135 Types of Prasadalu in Nandigama : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామి వారికీ 135 రకాల నైవేద్యాలు, ప్రసాదాలుగా పెట్టారు భక్తులు. నందిగామ పట్టణానికి చెందిన గోపు లక్ష్మీనారాయణ, లక్ష్మీ సుధారాణి దంపతులు గత 35 సంవత్సరాలుగా శ్రీకృష్ణుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా స్వామివారికి ప్రతి ఏటా 101 తగకుండా రకరకాల ప్రసాదాలు, పండ్లు సమర్పించి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెబుతున్నారు ఈ దంపతులు. ఈసారి ఏకంగా 135 రకాల ప్రసాదాలను చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టారు. గత ఏడాది 125 రకాల ప్రసాదాలను స్వామివారికి సమర్పించారు.

ఈ వేడుకలను చూసేందుకు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. స్వామివారిపై భక్తితో ప్రతి ఏడాది ఇలా చేస్తున్నామని నాగలక్ష్మీనారాయణ దంపతులు తెలిపారు. ఈ ప్రసాదాలలో పులిహోర, చెక్కర పొంగలి, దద్దోజనం, పాలు, బొబ్బట్లు, గవ్వలు, కాజాలు, పూర్ణాలతోపాటు పలు రకాల పిండివంటలను, పండ్లు, డ్రై ఫ్రూట్స్​ ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.