రాజంపేటలో ఘనంగా జరిగిన గంగమ్మ తల్లి జాతర - భారీగా తరలి వచ్చిన భక్తులు - Sri Gangamma Thalli Jatara - SRI GANGAMMA THALLI JATARA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 11, 2024, 1:27 PM IST
|Updated : Apr 11, 2024, 2:59 PM IST
Sri Gangamma Thalli Jatara Held Grandly in Rajampet: రాజంపేటలో ప్రసిద్ధ శ్రీ గంగమ్మ తల్లీ జాతర అత్యంత వేడుకగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట బలిజ పల్లెలో గురువారం శ్రీ గంగమ్మ తల్లీ జాతర ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. క్యూ లైన్లో బారులు తీరి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. భక్తులు, మహిళలు పొంగల్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చాందిని బండ్లు, డప్పు వాయిద్యాల నడుమ కోలాహలంగా జాతర ప్రాంగణం కనిపించింది. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జాతరకు తరలి వచ్చిన వారికి త్రాగునీరు, మజ్జిగ, అన్న ప్రసాదాల పంపిణీ చేశారు. డీఎస్పీ వీకే చైతన్య ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్తగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బంది ఉందకూడదని ముందస్తు చర్యలు తీసుకున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకున్నారు.