సీనియర్ జర్నలిస్టు ఆదినారాయణ అంత్యక్రియలు పూర్తి - journalist Adinarayana Last Rites - JOURNALIST ADINARAYANA LAST RITES
🎬 Watch Now: Feature Video
Published : Sep 27, 2024, 3:48 PM IST
SR journalist Adinarayana Last Rites : సీనియర్ పాత్రికేయులు, ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి.ఆదినారాయణ అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. పెద్దకుమారుడు చితికి నిప్పు పెట్టడంతో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. ఆదినారాయణను కడసారి చూసేందుకు పలువురు బంధువులు, పాత్రికేయ మిత్రులు, రాజకీయ నేతలు భారీగా తరలి వచ్చారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
గురువారం హఠాన్మరణం చెందిన ఆదినారాయణ ఈటీవీలో సుమారు 25 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2000 సంవత్సరంలో ఈటీవీలో విలేకరిగా చేరిన ఆదినారాయణ అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీప్ స్థాయికి చేరుకున్నారు. ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్, ఈటీవీ సీఈవో బాపినీడు, ఈనాడు, ఈటీవీ పాత్రికేయులు మియాపూర్‌లో ఆదినారాయణ నివాసానికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. ఆది నారాయణ హఠాన్మరణంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. నిబద్ధత కలిగిన సీనియర్ జర్నలిస్టును కోల్పోయామంటూ సానుభూతి తెలిపారు.