thumbnail

అక్రమ ఇసుక నిల్వలపై స్పీకర్‌ ఆగ్రహం - రంగంలోకి జాయింట్ కలెక్టర్‌ - Speaker on Illegal Sand Storage

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 8, 2024, 9:23 PM IST

Speaker Orders on Illegal Sand Storage in Anakapalli District: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గబ్బడ డిపోలో అక్రమంగా ఇసుక నిల్వ ఉంచడంపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టారు. 65 వేల టన్నుల ఇసుక ఎలా ఉంచారో నిగ్గు తేల్చాలని కలెక్టర్‌ను స్పీకర్‌ కోరారు. అప్పటి ఆర్డీవో సహా ఇతరుల పాత్రను నిగ్గుతేల్చి కేసులు నమోదు చేయాలన్నారు. ఈమేరకు రంగంలోకి దిగిన జాయింట్ కలెక్టర్‌ ఇసుక డిపోను పరిశీలించారు. ఎప్పటినుంచి ఇసుక నిల్వ ఉంచారన్నది ఆరా తీశారు.

కేసు నమోదు చేసిన తర్వాతే విక్రయాలు: నర్సీపట్నం ప్రాంతంలోని ఇసుక డిపో వద్ద విక్రయాలు తాత్కాలికంగా నిలిపివేశారు. మండలంలోని దుర్గాడ వద్ద ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఇసుక డిపోలో ప్రస్తుతం సుమారు 55 నుంచి 60 వేల టన్నులకు పైగా ఇసుక నిల్వలో ఉన్నప్పటికీ యంత్రాల మరమ్మత్తుల కారణంగా విక్రయాలు జరపటం లేదు. దీనికి తోడు డిపో చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం పాడైనట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే నర్సీపట్నం ఇసుక డిపోలో గతంలో గల్లంతయిన ఇసుక నిల్వలకు సంబంధించి పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. గల్లంతైన ఇసుక నిల్వలకు సంబంధించి కేసు నమోదు చేసిన తర్వాతే విక్రయాలు ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.