స్పెషల్ బ్రాంచ్ సీఐ జాకీర్ హుస్సేన్‌పై చర్యలు - డీజీ కార్యాలయానికి అటాచ్ - CI Zakir Hussain - CI ZAKIR HUSSAIN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-05-2024/640-480-21563337-thumbnail-16x9-anantapur.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 26, 2024, 3:15 PM IST
Anantapur Special Branch CI Zakir Hussain: అనంతపురం స్పెషల్ బ్రాంచ్ సీఐ జాకీర్ హుస్సేన్ ను రాష్ట్ర పోలీస్ డీజీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు జిల్లా ఎస్పీ గౌతమి శాలి తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్ లో పని చేస్తున్న సీఐ జాకీర్ హుస్సేన్, 10 ఏళ్లకు పైగా అనంతపురం వదిలి వెళ్లకుండా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నేతలతో అంటకాగుతూ అక్రమ కేసులు పెట్టారని సీఐ జాకీర్ హుస్సేన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీఐగా పని చేస్తున్నప్పుడు కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఆర్యవైశ్య వృద్ధులను బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. బళ్లారికి చెందిన ఆర్యవైశ్యుల భూమిని వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధి కబ్జా చేయడానికి యత్నించగా, ఆ ప్రజా ప్రతినిధి ఒత్తిడితో భూ యజమానుల బంధువులపై అక్రమ కేసులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, సీఐ జాకీర్ హుస్సేన్‌పై బళ్లారికి చెందిన సత్యనారాయణ శెట్టి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ గౌతమీ శాలి స్పెషల్ బ్రాంచ్ లో పని చేస్తున్న సీఐ జాకీర్ హుస్సేన్ ను రాష్ట్ర పోలీసు డీజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి న్యాయం కోసం వెళ్తే సీఐ వేధిస్తున్నారు - చర్యలు తీసుకోవాలంటూ బాధితుడి ఆవేదన - Land Issue CI Harassment