శ్రీకాళహస్తిలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు- అశ్వ, సింహ వాహనాలపై భక్తులకు దర్శనం - Shivaratri celebrations
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 13, 2024, 12:54 PM IST
Somaskandha Murthy Ghnana Prasoonambhika Devi At Horse Lion Vehicles: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమస్కంద మూర్తి సమేత శ్రీజ్ఞాన ప్రసూనాంబికా దేవి కైలాసగిరి ప్రదక్షిణ చేపట్టారు. స్వామి, అమ్మవార్లు అశ్వ, సింహ వాహనాలను అధిరోహించి భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామి వారు తలపాక ధరించి శౌర్యాన్ని ప్రదర్శిస్తూ అశ్వ వాహనంపై కొలువుదీరారు. సింహ వాహనంపై జ్ఞాన ప్రసూనాంబికా దేవి కొలువుదీరి మాడ వీధుల్లో ఊరేగారు. స్వర్ణాభరణాలు, స్వర్ణ వాహనాలపై కొలవుదీరిన ఆదిదంపతులను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేవతామూర్తులకు అడుగడుగునా స్వాగతం పలికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తుల (Devotee) శివనామస్మరణతో కైలాసగిరి మార్మోగింది.
Maha Shivaratri Brahmotsavalu in Srikalahasti: తిరుపతి జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి (Maha Shivaratri) వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భగా ప్రజలు భక్తి, శ్రద్దలతో స్వామి, అమ్మవార్లను దైవ దర్శనం చేసుకున్నారు.