ఓటు వెయ్యడం ప్రతి ఒక్కరి కర్తవ్యం- చైతన్యం కల్పించేలా గ్యాస్‌ స్టవ్‌ మెకానిక్‌ ప్రచారం - Social Worker Voter Campaign - SOCIAL WORKER VOTER CAMPAIGN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 4, 2024, 4:39 PM IST

Social Worker Vote Awareness Campaign in Guntur District : గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ రాజామోహనరావు అనే సామాజిక కార్యకర్త తన వంతుగా ఓటుహక్కు గురించి  ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. గ్యాస్‌ స్టవ్‌ మెకానిక్‌గా పనిచేసే రాజామోహనరావు బైక్​పై సంచార చలివేంద్రం నిర్వహిస్తూ రోడ్లపై వెళ్లే కూలీలు, కార్మికుల దప్పిక తీరుస్తుంటారు. ఎన్నికలు జరుగుతున్న వేళ ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు ఓటు హక్కు అవశ్యకత వివరించే ఫ్లెక్సీలను బైక్‌పై ఏర్పాటు చేసుకున్నారు. డబ్బులకు ఓట్లు అమ్ముకోవద్దు, నీతి నిజాయితితో పనిచేసే నాయకుల్ని ఎన్నుకోండి అంటూ ప్రచారం చేస్తున్నారు.

గ్యాస్ స్టవ్ మెకానిక్ గా పనిచేసే రాజామోహనరావు కేవలం ఐదో తరగతి వరకే చదివారు. హెచ్.పి గ్యాస్ ఏజెన్సీలో రూ.7వేల జీతానికి పనిచేస్తున్నారు. అయితే తనవంతుగా తోటి వారికి సాయం చేయటంలో మాత్రం ముందుంటారని స్థానికులు తెలిపారు. ఓటు వెయ్యడం ఒక బాధ్యత మాత్రమే కాదు ప్రతీ ఒక్కరి కర్తవ్యం అని ప్రచారం చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు రాజమోహన్​రావు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.