వంటింట్లో నుంచి వింత శబ్ధం - పరిశీలించి చూస్తే షాక్ - Snake Halchal in House in Muramalla
🎬 Watch Now: Feature Video
Snake Halchal in House in Muramalla Konaseema District : సాధారణంగా వర్షాకాలం ఇళ్లలోకి విష కీటకాలు, పాములు చేరుతుంటాయి. పల్లెటూర్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ముంపు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా గోదావరికి వరద వచ్చినప్పుడల్లా ఇటువంటి సమస్యతోనే లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విష సర్పాలు తమను ఎప్పుడు కాటు వేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.
కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామంలోని గోకవరపు మణికంఠ ఇంట్లో తాచుపాము హల్‌చల్ చేసింది. వంట గదిలో నుంచి వింత శబ్ధం వస్తుండడంతో ఎంటో అని పరిశీలించి చూడగా నల్ల తాచు పాము కనిపించింది. షాక్గురైన వారు వెంటనే తేరుకుని భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. బుసలు కొడుతున్న ఆ నల్లతాచును ఆయన చాకచక్యంగా అదుపు చేశారు. డబ్బాలో బంధించి జనసంచారం లేని ప్రాంతంలో విడిచి పెట్టాడు. ఈ క్రమంలో వరద నీటి ప్రవాహంతో విష సర్పాలు జనావాసాల్లోకి వస్తున్నాయని వాటిని చంపొద్దని స్నేక్ క్యాచర్ కోరారు. పాము కనిపించిన వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని గణేష్ వర్మ స్థానికులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఇటువంటి ఘటనలు తరచూ జరగడంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చీకటిగా ఉన్న వైపు లైట్ లేకుండా వెళ్లొద్దని సూచించారు.