ఆ మార్కెట్‌కు వెళితే కూరగాయలు ఉచితం! - Free Vegetable In Peddapalli Market - FREE VEGETABLE IN PEDDAPALLI MARKET
🎬 Watch Now: Feature Video
Published : Aug 27, 2024, 4:55 PM IST
Free Vegetable In Peddapalli Market : ఒకవైపు కూరగాయల ధరలు మండిపోతున్నాయి కానీ పెద్దపల్లిలో మాత్రం ఉచితంగా కూరగాయలు ఇస్తున్నారు. ఇది నిజమా అని ఆశ్చర్యపోతున్నారా? అవును ఇది నిజం. మంగళవారం ఉదయం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మార్కెట్లో వ్యాపారులు టన్నుల కొద్ది కూరగాయలను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారని తెలియడంతో ప్రజలు ఎగబడి మరీ సంచుల నిండా కూరగాయలు తీసుకెళ్లారు.
Small Vegetable Traders Protest : మార్కెట్లో హోల్‌సేల్ వ్యాపారుల రిటైల్ అమ్మకాలను నిరసిస్తూ చిరు వ్యాపారస్తులు మార్కెట్ బంద్ చేశారు. ఉదయం మార్కెట్‌కు కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారికి ఉచితంగా కూరగాయలను పంపిణీ చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తమ దుకాణాలను మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. మార్కెట్‌ల్లో హోల్ సేల్ వ్యాపారులు రిటైల్‌గా కూరగాయలను అమ్మవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ పాటించడంలేదని చిరువ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోల్‌సేల్ వ్యాపారుల రిటైల్ అమ్మకాలతో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి హోల్‌సేల్ వ్యాపారులతో మాట్లాడి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.