టీడీపీ నేతపై ఎస్సై అత్యుత్సాహం - ఎస్పీకి ఫిర్యాదు - Parchuri MLA Eluri Samba Siva Rao - PARCHURI MLA ELURI SAMBA SIVA RAO
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-04-2024/640-480-21294921-thumbnail-16x9-si-over-action-on-parchuri-mla-eluri-samba-sivarao.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 23, 2024, 6:52 PM IST
SI over Action on parchuri MLA Eluri Samba Siva Rao: బాపట్ల జిల్లా పర్చూరులో కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్ (Nomination) సందర్భంగా ఎసై (SI) శివనాగిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. సాంబ శివరావుతో పాటు ప్రపోజర్, పర్చూరు మండల అధ్యక్షుడు ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆయనపై ఎస్సై అనుచితంగా ప్రవర్తించారు. తెలుగుదేశం నాయకుడ్ని అసభ్య పదజాలంతో దూషించటంపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు.
Eluri Samba Siva Rao Fired on SI: ఎసై తీరుపై ఏలూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు తిట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. సాంబ శివరావు ప్రశ్నించటంతో తాను ఎలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేయలేదని ఎస్‌ఐ బుకాయించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎస్‌ఐ శివారెడ్డి వైఎస్సార్సీపీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఎస్పీకి ఏలూరి సాంబశివ రావు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ ఇప్పటికే ఎస్‌ఐ శివారెడ్డిని ఒకసారి ఈసీ అధికారులు వీఆర్‌కు పంపారు. దీంతో వీఆర్ నుంచి ఆర్వో కార్యాలయానికి బందోబస్తుకు వచ్చారు. అయినా ఆయన తీరులో ఎలాంటి మార్పు లేదని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.