సాయి సంస్థాన్‌కు విరాళంగా 23 లక్షల 50 వేల డయాలసిస్ యంత్రాలు - Shirdi Sai Baba Devotee donation - SHIRDI SAI BABA DEVOTEE DONATION
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-04-2024/640-480-21352976-thumbnail-16x9-shirdi-sai-baba-devotee-contribution-to-sainath-hospital.jpeg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 30, 2024, 6:45 PM IST
Shirdi Sai Baba Devotee Contribution To Sainath Hospital : ముంబయిలోని తారాదేవి ఫౌండేషన్, సర్కార్ గ్రూప్ డైరెక్టర్ ఆకాష్ గుప్తా 23 లక్షల 50 వేల రూపాయలతో సాయి సంస్థాన్‌కు రెండు డయాలసిస్ యంత్రాలను విరాళంగా అందించారు. వాటిని సాయిబాబా సంస్థాన్‌లోని సాయినాథ్ హాస్పిటల్‌లో ఆధునిక పద్ధతిలో అమర్చారు. పేద రోగుల కోసం షిర్డీ సాయిబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు.
సాయినాథ్ ఆసుపత్రికి సాయిబాబా రోగుల సంరక్షణను భగవంతుని సేవగా భావించి బాబా ఆలోచనల వల్లే ఈ విరాళాన్ని ఇచ్చానని గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సాయినాథ్ హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ డైరెక్టర్ డా. ప్రీతమ్ వడ్గవే, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తుషార్ షెల్కే, సాయినాథ్ హాస్పిటల్ అసిస్టెంట్ ఆఫీసర్ నజ్మా సయ్యద్, బయోమెడికల్ డిపార్ట్‌మెంట్ ఇంజనీర్ రాజేష్ వాకడే, తుషార్ కుటే, సిస్టమ్ కాంబ్లే, స్టోర్ కీపర్ సునీల్ నికమ్ తదితరులు పాల్గొన్నారు.